అమెరికా ఎన్నికలపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆరోపణలు గుప్పించారు. 2020 ఎన్నికలు ‘భారీ మోసం’ అని పేర్కొన్న ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. తనకు వ్యతిరేకంగా బడా టెక్ కంపెనీలు డెమోక్రాట్లతో జతకట్టాయని ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశారంటూ ఎలన్ మస్క్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంగానే ట్రంప్ స్పందించారు. డెమోక్రాట్లతో కలిసి తనకు వ్యతిరేకంగా టెక్ కంపెనీలు కుట్ర పన్నాయని ట్రంప్ ఆరోపించారు.
తప్పడు, మోసపూరిత ఎన్నికలను ప్రజలు కోరుకోలేదని, అలాంటి తప్పు చేసిన వారిని క్షమించరని ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వైట్ హౌజ్ ఖండించింది. ట్రంప్ రాజ్యాంగానికి శత్రువు అని వైట్ హౌజ్ మండిపడింది. ఆయన గెలిచిన సమయంలోనే రాజ్యాంగంలోని అన్ని నియమాలు, నిబంధనలను, ఆర్టికల్స్ ను రద్దు చేయాలని అనుకున్నారని ఆరోపించింది. గెలిచినప్పుడే అమెరికాను ప్రేమించడం కాదని, ఓడిపోయినా ప్రేమిస్తూనే వుండాలని వైట్ హౌజ్ ప్రతినిధి ఆండ్రూబేట్స్ చురకలంటించారు.