కెనడా శుభవార్త ….2023 నుంచి ఇది అమల్లోకి

కెనడా  ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ (ఓడబ్ల్యూపీ) హోల్డర్లకు శుభవార్త చెప్పింది. దేశంలో నెలకొన్న లేబర్‌ కొరత నేపథ్యంలో వర్క్‌ పర్మిట్‌ను విస్తరిస్తూ ఓడబ్ల్యూపీ హోల్డర్ల కుటుంబ సభ్యులు కూడా ఉద్యోగాలు చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కెనడా మంత్రి సేన్‌ ఫ్రేజర్‌ ప్రకటన చేశారు.  2023 ప్రారంభం నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు.  ఈ నిర్ణయం ద్వారా కెనడాలో గణనీయంగా ఉండే వేల మంది భారతీయులకు లబ్ధి చేకూరనున్నది. ఏ ఉద్యోగం అయినా చేసుకొనేందుకు ఈ ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ విదేశీయులను అనుమతిస్తుంది. దేశంలో నెలకొన్న లేబర్‌ కొరత సమస్యను పరిష్కరించడంలో తాజా నిర్ణయం సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates