2047 నాటికి నావికా దళం ఆత్మనిర్భర్ గా మారుతుంది : నేవీ చీఫ్ ప్రకటన

అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ పూర్తైందని, 3 వేల మంది అగ్నివీరులు శిక్షణలో చేరారని నేవీ చీఫ్ అడ్మిన్ హరి కుమార్ ప్రకటించారు. 3 వేల మందిలో 341 మంది మహిళలున్నారని, వచ్చే బ్యాచ్ కల్లా మహిళల సంఖ్యను పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. షిప్పులు, ఎయిర్ బేస్ లలో, ఎయిర్ క్రాఫ్ట్ లో వారిని శిక్షణలో చేర్చామని, అందరికీ ఒకే రకమైన శిక్షణ ఇచ్చామని, మహిళలు ప్రత్యేక శిక్షణ వుండదని తేల్చి చెప్పారు. లింగ వివక్ష వుండదని, వారి వారి మనో స్థైర్యాలను బట్టే తీసుకుంటామని తేల్చి చెప్పారు.

 

ఆత్మనిర్భర భారత్‌పై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చిందని, 2047 నాటికి నావికాదళం ఆత్మనిర్భర్‌గా మారుతుందని హామీ ఇచ్చామని అన్నారు. తేలికపాటి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రారంభించడం దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిందని అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా సైనిక, పరిశోధనా నౌకల కదలికలపై నావికాదళం గట్టి నిఘా ఉంచిందని అన్నారు. గత ఏడాది కాలంలో భారత నావికా దళం అత్యధిక కార్యాచరణను సాధించిందని, సముద్ర భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు.

 

హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు చెందిన అనేక ఓడలు తిరుగుతుంటాయి. 4-6 చైనా నౌకాదళ, పరిశోధక నౌకలు కూడా తిరుగున్నట్లు తెలిసిందన్నారు. . చైనా చేపల నౌకలు కూడా బాగా ఉంటాయని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలోని ఆయా అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నాం అని అన్నారు. హిందూ మహాసముద్రం చాలా కీలకమైన ప్రాంతమని, పెద్ద ఎత్తున దాని మీదుగా వాణిజ్యం, రవాణా వంటి కార్యకలాపాలు జరుగుతుంటాయని గుర్తు చేశారు. హిందూ మహాసముద్రానికి సంబంధించి భారత ప్రయోజనాలను కాపాడుకోవడమే తమ విధి అని  అని తెలిపారు.

Related Posts

Latest News Updates