ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు అందజేసింది. ఈ నెల 6 న హైదరాబాద్ లో గానీ, ఢిల్లీలో గానీ విచారణకు సహకరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో తన నివాసంలోనే విచారణకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ వెళ్లి… సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. సీబీఐ విచారణ విషయంలోనే వీరిద్దరి మధ్యా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. సీబీఐ విచారణ సమయంలో ఎలా వ్యవహరించాలో సీఎం కేసీఆర్ ని కవిత అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపింది. 160 సీఆర్పీసీ కింద విచారణకు సహకరించాలని కోరింది. సీబీఐ డీఎస్పీ అలోక్ కుమార్ కవితకు నోటీసులిచ్చారు. ఈ నెల 6 న ఉదయం 11 గంటలకు ఢిల్లీ, హైదరాబాద్ ఎక్కడైనా విచారణకు హాజరుకావొచ్చని సూచించింది. అయితే… తనకు సీబీఐ నోటీసులు అందాయని ఎమ్మెల్సీ కవిత అంగీకరించారు. హైదరాబాద్ లోని తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని ప్రకటించారు.