తనయుడు రాం చరణ్ ను ఉద్దేశించి మెగా స్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. రాం చరణ్ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియాలో ట్రూ లెజెండ్ అవార్డును అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కంగ్రాట్స్ డియర్ చరణ్. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియాలో ట్రూ లెజెండ్ అవార్డు నువ్వు అందుకున్నందుకు నేనెంతో గర్విస్తున్నా. నువ్వు ఇలాగే ముందుకు సాగాలని అమ్మా, నేనూ కోరుకుంటున్నాం అని చింరజీవి ట్వీట్ చేశారు. దీనికి రాంచరణ్ రీ ట్వీట్ కూడా చేశారు. లవ్ యూ అప్పా అంటూ చరణ్ రిప్లై ఇచ్చారు. ప్రముఖ మీడియా కంపెనీ ఎన్డీటీవీ వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను అందజేసింది. సినిమా రంగంలో రాం చరణ్ కు అవార్డు అందించింది.
https://twitter.com/KChiruTweets/status/1598715958126084097?s=20&t=vibD13rfPybZ1HSvgptLrw













