గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని మంత్రి కేటీఆర్ అన్నారు. వార్డ్ ఆఫీసర్ల నియామకంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టి సారించవచ్చని చెప్పారు. గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలలో వార్డు అధికారుల నియామకం జరుగబోతున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదలచేసింది. గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య. దీంతో పౌర సమస్యలపై మరింతగా దృష్టిసారించవచ్చు. వార్డు అధికారులకు కౌన్సిలర్లతో మంచి సమన్వయం జరుగుతుంది. గ్రూప్-4 నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.’ అని ట్విట్టర్లో పోస్టు చేశారు.
Group-4 Notification issued by TSPSC
In a pioneering initiative, Ward officers will be appointed by the Telangana Govt across all 141 Municipalities
This will bring in hyper local focus on civic issues & help synergise with ward councillors
My gratitude to Hon’ble CM KCR Garu pic.twitter.com/2Jx0NPQVT8
— KTR (@KTRTRS) December 2, 2022