జేఎన్‌యూ లో బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు… సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన వీసీ

ఢిల్లీలోని జేఎన్ యూ (జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ) లో మళ్లీ వివాదం రేగింది. క్యాంపస్లోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు రాశారు. బ్రాహ్మణులు క్యాంపస్ ను విడిచి వెళ్లిపోవాలి. బ్రాహ్మణులు, బనియాలు మీ కోసం వస్తున్నాం… ప్రతీకారం తీర్చుకుంటాం…. బ్రాహ్మణ్ భారత్ ఛోడో అంటూ నినాదాలు రాశారు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

అయితే… ఈ ఘటనపై వీసీ శాంతిశ్రీ డీ పంటిట్ ఖండించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇటువంటి మినహాయింపు, వేరు భావనల ధోరణులను యాజమాన్యం ఖండిస్తోందని తెలిపింది. జేఎన్‌యూ అందరికీ చెందుతుందని, అందువల్ల ఇటువంటి సంఘటనలను సహించేది లేదని పేర్కొంది. ఏబీవీపీ జేఎన్‌యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ మాట్లాడుతూ, బ్రాహ్మణ, వైశ్య వ్యతిరేక నినాదాలను ఖండించారు. కమ్యూనిస్టు గూండాలు ఈ విధంగా విద్యా సంస్థల ప్రాంగణాలను నాశనం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. స్వేచ్ఛగా ఆలోచించే ప్రొఫెసర్ల ఛాంబర్లను పాడు చేశారన్నారు.

Related Posts

Latest News Updates