భారత్ లో లవ్ జిహాద్ ను అరికట్టేందుకు కేంద్రం వెంటనే ఓ చట్టాన్ని తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. శ్రద్ధా వాకర్ హత్య కేసును వీహెచ్ పీ ఉదహరిస్తూ… ఇది కచ్చితంగా లవ్ జిహాద్ కేసే అని నొక్కి చెప్పింది. ఒక్క ఢిల్లీలోనే గత 10 ఏళ్లలో దాదాపు 420 లవ్ జిహాద్ కేసులు బయటికి వచ్చినట్లు వీహెచ్ పీ పేర్కొంది. శ్రద్ధా వాకర్ ను దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్ కు 20 మంది గర్ల్ ఫ్రెండ్స్ వున్నారని, వారంతా హిందువులేనని, దీనిని బట్టి చూస్తేనే పక్కా ప్లాన్ అని అర్థమవుతోందని వీహెచ్ పీ జాయింట్ జనరల్ సెక్రెటరీ సురేంద్ర జైన్ అన్నారు. లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్న తరుణంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ధరమ్ రక్ష పేరుతో లవ్ జిహాద్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వీహెచ్ పీ ప్రకటించింది.