జేసీ ప్రభాకర్ రెడ్డికి ఝలక్… 22.10 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ ఝలక్ ఇచ్చింది. బస్సుల కొనుగోలు అవినీతి కేసులో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన దివాకర్ రోడ్ లైన్స్, జఠాదర ఇండస్ట్రీస్ కి చెందిన 22.10 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు గోపాల్ రెడ్డి ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. బీఎస్ 3 వాహనాలను నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి బీఎస్ 4గా మార్చినట్టు ఈడీ గుర్తించింది. నాగలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్స్ జరిగినట్టు గుర్తించింది. ఆర్టీవో అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈడీ విచారణ ప్రారంభించింది. అశోక్ లేలాండ్ నుంచి స్క్రాప్ లో వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది.

Related Posts

Latest News Updates