బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్రకు బయల్దేరిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసి, కోరుట్ల శివారు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇచ్చింది. యాత్ర ప్రారంభోత్సవ సభ భైంసాకు 3 కిలోమీటర్ల దూరంలో వుంటేనే అనుమతించాలని హైకోర్టు పోలీసులకు సూచించింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య మాత్రమే సభ జరుపుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 500 మంది తో మాత్రమే పాదయాత్ర చేయాలని.. 3వేల మందితోనే సభ జరుపుకోవాలని హైకోర్టు నిర్దేశించింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని సూచించింది.







