పుడ్‌ బిజినెస్‌కు అమెజాన్‌ గుడ్‌ బై

డిసెంబర్‌లో ఇ-కామర్స్‌ దిగ్జ సంస్థ అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌ నుంచి వైదొలగనుంది. 2020 మే నెలలో  బెంగళూర్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌ అమెజాన్‌ ప్రారంభించింది. అమెజాన్‌ ఫుడ్‌ సర్వీస్‌ అంతగా కస్టమర్ల ఆదరణ పొందలేదు. నష్టాలు తగ్గించుకునేందుకు అమెజాన్‌ ఈ బిజినెస్‌ను వచ్చే నెల 29 నాటికి నిలిపేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ భాగస్వామ్య రెస్టారెంట్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. బెంగళూర్‌లో 62 ప్రాంతాలకు ఫుడ్‌ డెలివరీ విస్తరించిన్పటికీ తగిన సంఖ్యలో ఆర్డర్లు రాలేదు.  స్విగ్గీ, జొమాటోల మాదిరిగా అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీకి పెద్దగా స్పందన రాలేదు. ఇప్పటికే కంపెనీ అమెజాన్‌ అకాడమీని కూడా మూసివేసింది. మరో వైపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Related Posts

Latest News Updates