మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బిజెపి కండువా కప్పుకున్నారు.   శశిధర్ రెడ్డికి మంత్రులు పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందజేశారు.  పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందజేసిన వెంటనే బండి సంజయ్ పార్టీ కండువా కప్పగా, మిగతా నేతలు పుష్ఫగుచ్ఛాలిచ్చి ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, చేరికల కమిటీ ఛైర్మన్ – ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీలు రవీంద్ర నాయక్, వివేక్ వెంకటస్వామి, పార్టీ సమన్వయకర్త (తెలంగాణ) నూనె బాల్‌రాజ్ ఉన్నారు.