టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే సిట్ అధికారులు దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తున్నారు. విచారణకు హాజరుకావాలని అధికారులు పలువురికి నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న వాళ్లలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ విచారణకు హాజరుకాని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ నోటీసులపై బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. సిట్ నోటీసులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. విచారణకు హాజరుకావాలని బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ నోటీసులను రద్దు చేయాలని బీఎల్ సంతోష్ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.