తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ నెలలో నిర్వహించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వారంరోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అభివృద్ది జ‌ర‌గ‌కుండా కేంద్రం అడ్డుక‌ట్ట వేస్తోంద‌ని, కేంద్రం విధిస్తున్న ఆంక్ష‌ల‌పై చ‌ర్చించాల‌ని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ విషయాలను అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ అన్నారు.  ప్రధానంగా అభ్యుదయ పథంలో నడుస్తున్న రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022..20-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో రూ.40 వేల కోట్లకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది. ఇటువంటి చర్యలతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నది. రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ చేస్తున్న మోసాలను ప్రజలకు సవివరంగా వివరించే విధంగా సమావేశాల నిర్వహణ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని గురువారం సిఎం కెసిఆర్ ఆదేశించారు.