మంత్రి సత్యేంద్ర జైన్ విలాసవంతమైన భోజనం… మరో వీడియో బయటికి

తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ పై రోజుకో ఆరోపణలు వస్తున్నాయి. రోజుకో వీడియో బయటికి వస్తోంది. దీంతో ఆయన వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా… మంత్రి సత్యేంద్ర జైన్ జైలు గదిలో సలాడ్లు, పండ్లు, ఇతర ఆహారం తింటున్న వీడియోలు బయటికి వచ్చాయి. దీనిని బీజేపీ విడుదల చేసింది. మంత్రికి సంబంధించిన విలాసవంతమైన భోజనం గురించి ఈ వీడియోలో వుంది. దీంతో ఆప్, బీజేపీ మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది.

 

మొదటగా మంత్రి సత్యేంద్ర జైన్ కు మసాజ్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. అయితే.. అది ఫిజియోధెరపి కాదని, చేసే వ్యక్తి కూడా ఫిజియోథెరపిస్ట్ కాడని, రేపిస్ట్ అని జైలు వర్గాలు పేర్కొన్నాయి. రేపిస్ట్ రింకు అని, అతనిపై పోస్కో చట్టంతో సహా పలు కేసులు కూడా వున్నాయని జైలు వర్గాలు పేర్కొనడంతో వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు విలాసవంతమైన భోజనం వీడియో బయటికి రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

Related Posts

Latest News Updates