మంత్రి మల్లారెడ్డి నివాసాలు, కుమారుడు, అల్లుళ్ల నివాసాలపై రెండో రోజు కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అయితే… ఐటీ రైడ్స్ కొనసాగుతుండగా… మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి హఠాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ఐటీ అధికారులకు తెలిపారు. దీంతో వారు ఆయనను సూరారంలోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తన కుమారుడ్ని ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. సీఆర్పీఎఫ్ బలగాలు కొట్టడం వల్లే తన కుమారుడు అస్వస్థతకు గురయ్యారని ఆరోపించారు. ఇక…. మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఆరోగ్యంపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న ఐటీ అధికారులు వైద్యుల దగ్గర వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక… ముందు జాగ్రత్తగా ఆస్పత్రి ముందు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.







