అసోం- మేఘాలయ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణ… కాల్పుల్లో ఐదుగురు మృతి

అసోం, మేఘాలయ మధ్య మళ్లీ చిచ్చు రాజుకుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన జైంటియా హిల్స్ వద్ద అక్రమ కలప రవాణాను అడ్డుకునే క్రమంలో అసోం ఫారెస్ట్ అధికారులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మేఘాలయాకు చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో నేటి ఉదయం 10 గంటల నుంచి 48 గంటల పాటు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ ను నిలిపేస్తున్నట్లు మేఘాలయ ప్రకటించింది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే.. అసోం ఫారెస్ట్ అధికారులు తమ వ్యక్తులను అరెస్ట్ చేశారన్న వార్తను తెలుసుకున్న మేఘాలయ ప్రాంత ప్రజలు భారీగా సరిహద్దు ప్రాంతాల్లోకి చేరుకున్నారు. తమ వారిని విడుదల చేయాలని అటవీ సిబ్బందిపై దాడి చేశారు. అందుకే కాల్పులు జరిపామని అసోం వివరించింది.

అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అసోం పోలీసులు అడ్డగించారు. దీంతో అసోం- మేఘాలయ సరిహద్దుల్లో హింస చెలరేగింది. అసోం పరిధిలోని పశ్చిమ కర్బీ అంగ్లాగ్ జిల్లాలోని ముక్రూ ప్రాంతలో అక్రమ కలపను అడ్డుకున్నారు. పలువురు పారిపోతుండగా… అసోం పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న మేఘాలయ వాసులు వెంటనే వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ… అసోం సిబ్బందిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు చేశారు.

Related Posts

Latest News Updates