మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఎస్ దేవేందర్ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొండాపూర్ సెంట్రల్ పార్క్ లోని ఇంట్లో తల్లిదండ్రులతో వుంటున్న అక్షయ్ (23)… సోమవారం ఉదయం 10:30 గంటలకు ఇంట్లో ఉరేసుకున్నాడు. అయితే… ఎందుకు ఉరేసుకున్నాడన్న కారణాలు తెలియాల్సి వుంది. ఇక… అక్షయ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. అయితే… ఈ మధ్యే అక్షయ్ డబుల్ బెడ్రూం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అరెస్ట్ కూడా అయ్యాడు. మరి ఇదే కారణమా? ఇతరత్రా కారణాలున్నాయా? అని అధికారికంగా తేలాల్సి వుంది.