నగరంలోని పాతబస్తీలో బాంబు కలకలం రేపింది. చార్మినార్ వద్ద బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే బాంబు స్క్వాడ్ తో చార్మినార్ వద్దకు వెళ్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో చార్మినార్ వద్ద ఫుట్ పాత్ పై వుండే చిన్న చిన్న వ్యాపారులను కూడా ఖాళీ చేయించారు. సందర్శకులను కూడా ఖాళీ చేయించారు. అయితే… ఈ ఫోన్ కాల్ గురించి మరింతగా తెలియాల్సి వుంది. చివరికి అలాంటిదేమీ లేదని పోలీసులు ప్రకటించారు.