మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదని, చరిత్రను తిరగరాయాలని అసోం సీఎం హేమంత విశ్వ శర్మ అన్నారు. మొఘలులు భారత దేశం మొత్తాన్ని పాలించారని వామపక్ష చరిత్రకారులు వక్రీకరించారని, ఈశాన్య భారతాన్ని, అసోంను మొఘలులు ఎన్నడూ జయించలేదని తేల్చి చెప్పారు. యావత్ భారత్ మొఘలులు చేతిలో ఓడిపోయిందనేది వామపక్షాల కుట్రగా ఆయన అభివర్ణించారు. భారతీయ రాజులను, పాలకులను తప్పుగా చూపించడం వామపక్షీయులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత చరిత్రను వామపక్ష చరిత్రకారులు ధ్వంసం చేశారని మండిపడ్డారు.
ఇక… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలను కూడా సీఎం హిమంత తీవ్రంగా దుయ్యబట్టారు. దేశం కోసం సావర్కర్ చాలా సంవత్సరాలు కఠిన కారాగార జైలు శిక్షను అనుభవించారని, ఇంత చేసిన సావర్కర్ ను ప్రశ్నించిన వారికి పాపం వస్తుందని సీఎం హెచ్చరించారు. ఈ పాపాన్ని రాహుల్ గాంధీ చేయకూడదని హిమంత అన్నారు.












