జగన్ రెడ్డి కాదు… రివర్స్ రెడ్డి అంటూ చంద్రబాబు ఘాటు ట్వీట్

ముఖ్యమంత్రి జగన్ నర్సాపురం పర్యటన సందర్భంగా అక్కడి అధఆికారులు చెట్లు కొట్టేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. నువ్వు జగన్ రెడ్డి కాదు.. రివర్స్ రెడ్డి చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులే… చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే రివర్స్ పాలనకు ఉదాహరణ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో నరసాపురం ప్రాంతీయ ఆసుపత్రి ముందు ఎన్నో ఏళ్లుగా నీడనిస్తున్న చెట్టును పురపాలక సిబ్బంది నరికివేశారు. మేదర్ల వంతెన, ట్యాక్సీ స్టాండ్‌ ఏరియాలోనూ పెద్ద ఎత్తున చెట్లు, కొమ్మలను తొలగించినట్టు సమాచారం. సీఎం కాన్వాయ్‌ వచ్చే మార్గంలో డివైడర్‌కు రెండువైపులా ఉన్న చెట్ల కొమ్మలు నరికేసి ఫ్లెక్సీలు పెట్టారని ఆరోపిస్తున్నారు.

Related Posts

Latest News Updates