చిరంజీవి విలక్షణ నటుడు అంటూ అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ – 2022 పురస్కారం మెగాస్టార్ చిరంజీవిని వరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు ప్రకటించారు. చిరంజీవి విలక్షణమైన నటుడని అన్నారు. అద్భుత వ్యక్తిత్వం, నటనా చతురతతో అనేక పాత్రలు పోషించారని మోదీ కొనియాడారు. తన పాత్రల ద్వారా ప్రేక్షకుల అభిమానం, ఆదరణను సంపాదించుకున్నారని కొనియాడారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైనందుకు చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.

 

Related Posts

Latest News Updates