మదర్ డెయిలీ పాల ధరలు మళ్లీ పెరిగాయి. ఇలా పెంచడం ఈ యేడాదిలో ఇది నాలుగో సారి. ఫుల్ క్రీమ్ లీటర్ పాలపై రూపాయి. టోకెన్ మిల్క్ లీటర్ పై 2 రూపాయలు పెంచుతున్నట్లు మదర్ డెయిలీ సంస్థ ప్రకటించింది. అయితే… ఢిల్లీతో పాటు దేశ రాజధాని ప్రాంతంలో ఈ పెంపు ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. డెయిరీ రైతుల నుంచి ముడి పాల సేకరణ ధర పెరిగినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మదర్ డెయిరీ ప్రకటించింది. దీని ప్రకారం ఫుల్ క్రీమ్ పాలు లీటర్ ధర 64 రూపాయలకు చేరుకుంది.












