ఒక్క ఆయిల్ ట్యాంకర్ 48 కార్లను ఢీకొట్టింది… పలువురికి తీవ్ర గాయాలు

ఒకే ఒక్క ఆయిల్ ట్యాంకర్… ఏకంగా 48 వాహనాలను ఢీకొట్టింది. దీంతో 48 కార్లు దెబ్బతినడమే కాకుండా 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది జరిగింది పూణె- బెంగళూరు జాతీయ రహదారిపై. నావల్ బ్రిడ్జిపై వేగంగా దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్ ఈ వాహనాలన్నింటినీ ఢీకొట్టింది. అయితే… ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ఈ ఘటన జరిగింది. ట్యాంకర్ నుంచి ఆయిల్ కింపడటంతో వాహనాలు జారిపోయాయి. దీంతో తీవ్ర ప్రమాదం సంభవించింది. గత కొన్నిరోజులుగా జాతీయ రహదారిపై వున్న నావెల్ బ్రిడ్జి అనేక ప్రమాదాలకు నిలయంగా మారిపోయింది.అయినా…. దాని విషయంలో అధికారులు అలాగే వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఇక… ఈ ప్రమాదం జరగడంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. పూణె అగ్నిమాపక దళం, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీల రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

 

Related Posts

Latest News Updates