కేంద్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ గోయల్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ నేడు బాధ్యతలు స్వీకరించారు. మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ ను ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా లభించింది. కేంద్ర ఎన్నికల సంఘంలో ఓ ప్రధాన కమిషనర్ తో పాటు ఇద్దరు కమిషనర్లు వుంటారు. ప్రస్తుతం ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ వున్నారు. అనూప్ చంద్రపాండే, సుశీల్ చంద్ర కమిషనర్లుగా వున్నారు. అయితే… సుశీల్ చంద్ర పదవీ విమరణతో కమిషనర్ పదవి ఖాళీ అయ్యింది. ఆయన స్థానంలోనే అరుణ్ గోయల్ బాధ్యతలు స్వీకరించారు. అరుణ్ గోయల్ 1985 పంజాబ్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సర్వీసులో వుండగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.

Related Posts

Latest News Updates