క్యాసినో వ్యవహారంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ ఈడీ విచారణకు హాజరయ్యారు. దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరవ్వాలంటూ ఈడీ ఎల్. రమణకు నోటీసులిచ్చింది. ఈ సందర్భంగా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ సమయంలోనే ఎల్. రమణ అస్వస్థతకు గురయ్యారు. తనకు అస్వస్థ వుందని చెప్పడంతో ఈడీ అధికారులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. హైదర్ గూడ అపోలో ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను సోమాజిగూడలోని యశోద వఆస్పత్రికి తరలించారు.
ఇక.. చీకోటి ప్రవీణ్ కి చెందిన క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మంత్రి తలసాని సోదరులిద్దర్నీ ఈడీ విచారించింది. వారితో పాటు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ గుర్నాథరెడ్డిని కూడా ఈడీ విచారించింది. గుర్నాథ రెడ్డి తర్వాత ఈడీ రమణను విచారించింది. రమణ విదేశాలకు వెళ్లి, క్యాసినో ఆడినట్లు ఆరోపణలు వచ్చాయి.