ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని, తమ కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేకే… భౌతిక దాడులకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని వారే ప్రశ్నించే వారి గొంతు ఇలా నొక్కాలని చూస్తారని అన్నారు. గడీల గూండా దాడులకు తాము భయపడని బండి సంజయ్ స్పష్టం చేశారు.