2024 లో తాము ప్రాంతీయ, డెమోక్రెటిక్ పార్టీలతో కలిసి పనిచేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా అన్నారు. ఆ ఎన్నికలు ఎంతో కీలకమైనవని అన్నారు. ప్రస్తుత పార్టీలు, రాజకీయ విధానాలపై తాము అధ్యయనం చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజా మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను లూటి చేస్తు కార్పొరేట్ శక్తులకు అమ్ముతుందని మండిపడ్డారు.
దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 2014 ఎన్నికల సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని మోదీ నెరవేర్చలేకపోయారని నిప్పులు చెరిగారు. దేశం ఆర్థిక సంక్షోభంలో వుందని, కానీ మోదీ మద్దతు ఇస్తున్న కార్పొరేట్ శక్తులు మరింత బలోపేతం అయ్యాయని విమర్శించారు. కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని బలవంతంగా రాష్ట్రాలపై రుద్దుతోందని మండిపడ్డారు.







