జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. తమ జాకీ కంపెనీ పక్షాన తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జ‌నాల్లో పాపులారిటీ సంపాదించుకున్న ఇన్న‌ర్ వేర్ బ్రాండ్ జాకీ(పేజ్ ఇండ‌స్ట్రీస్) ఇబ్ర‌హీంప‌ట్నం, ములుగులో గార్మెంట్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ ఫ్యాక్ట‌రీల‌ను ఏర్పాటు చేయ‌బోతుంద‌ని కేటీఆర్ తెలిపారు. ఒక కోటి బ‌ట్ట‌ల‌ను ఉత్ప‌త్తి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ఫ్యాక్టరీని నెల‌కొల్ప‌నున్నారు. దీంతో 7 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా జాకీ కంపెనీని హృద‌య‌పూర్వ‌కంగా స్వాగ‌తిస్తూ, శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

https://twitter.com/KTRTRS/status/1592760445785739265?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1592760445785739265%7Ctwgr%5Efdf49e6b029c86aa11e1c9b90371f43c7892da5b%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Finner-wear-brand-jockey-will-be-setting-up-garment-manufacturing-factories-intelangana-841682