ఇండోనేషియాలోని బాలిలో జీ 20 సదస్సు నడుస్తోంది. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి ప్రధాని నరేంద్ రమోదీ జీ 20 దేశాల అధ్యక్ష బాధ్యతలను అధికారికంగా అందుకున్నారు. అయితే… ఈ బాధ్యతలు వచ్చే నెల 1 నుంచి భారత్ చేపట్టనుంది. వచ్చే ఏడాది జీ 20 సమావేశాలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. కరళతాల ధ్వనులు, ఆయా దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రధాని మోదీ జోకో విడోడో నుంచి జీ 20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఇది ప్రతి ఒక్క భారతీయుడికీ దక్కిన గౌరవమని మోదీ అభివర్ణించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు, వసుధైక కుటుంబం అనే భావనతో భారత్ వేదికగా 2023 లో జీ 20 ని నిర్వహిస్తామని మోదీ ప్రకటించారు.












