చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా… టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ కు ఈడీ నోటీసులిచ్చింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. వీరితో పాటు మరికొందర్ని కూడా ఈడీ విచారించనుంది. ఇప్పటికే మంత్రి తలసాని సోదరులు మహేష్, ధర్మేంద్ర యాదవ్ కు నోటీసులు అందాయి. వీరు ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు.