భారత్-ఇండోనేషియా వ్యాపార సంబంధాలకు వేలాది సంవత్సరాల చరిత్ర వుంది : మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియాలో భారత సంతతికి చెందిన వారితో సమావేశమయ్యారు. జీ 20 సదస్సు ముగిసిన తర్వాత ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా, ఇండోనేషియా మధ్య వున్న సంబంధాలు, అనుబంధాల గురించి ప్రస్తావించారు. భారత దేశం, ఇండోనేషియా మధ్య అనుబంధం ఉమ్మడి సంస్కృతి, వారసత్వాలకు సంబంధించినదని తెలిపారు. ఇక… అక్కడికి చేరుకున్న మోదీకి… ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బాలీలో ఈ సమయంలో, ఇక్కడికి 1,500 కిలోమీటర్ల దూరంలో భారత దేశంలో ఉన్న కటక్‌లో బాలి యాత్ర మహోత్సవం జరుగుతోందన్నారు.

 

 

భారత్-ఇండోనేషియా వ్యాపార సంబంధాలకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉందని, దానిని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది జరుగుతున్న బాలి యాత్ర దృశ్యాలను ఇండోనేషియన్లు ఇంటర్నెట్‌లో చూసి, గర్వపడతారని, సంతోషిస్తారని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఒడిశాలో ప్రజల భాగస్వామ్యంతో బాలి జాతర మహోత్సవం జరుగుతోందని చెప్పారు.

Related Posts

Latest News Updates