సీఎం కేసీఆర్ బీజేపీ పెద్దలపై సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను కూడా బీజేపీ నేతలు తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని, ఇంతకంటే దారుణం ఏమైనా వుంటుందా? అని ప్రశ్నించారు. తెలంగా ణ భవన్ లో నేడు పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని పేర్కొంటూ… కవిత విషయాన్నికూడా ప్రస్తావించారు. పార్టీ మారాలంటూ బీజేపీ ఆమెపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. బీజేపీ చాలా నీచంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
పార్టీ ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యేలను మార్చాలన్న ఉద్దేశం తనకు లేదని, సర్వేలన్నీ తమకే అనుకూలంగా వున్నట్లు కేసీఆర్ అన్నారు. మళ్లీ వందకు వంద శాతం అధికారం మనదే అని సీఎం అన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.