ప్రసార భారతి సీఈవోగా గౌరవ్ ద్వివేది… రాష్ట్రపతి ఆమోదం

ప్రసార భారతి సీఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి గౌరవ్ ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. 1995 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి ద్వివేది… ఛత్తీస్ గఢ్ కేడర్ అధికారి. 5 సంవత్సరాల పాటు ఆయన సీఈఓగా బాధ్యతల్లో వుంటారని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ద్వివేది చత్తీస్ గఢ్ కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా బాధ్యతల్లో వున్నారు. అయితే.. సెలక్షమన్ కమిటీ ఆయన్ను ప్రసార భారతి సీఈఓగా ఎంపిక చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆయన 5 సంవత్సరాల పాటు ఈ పదవిలో వుంటారు.

Related Posts

Latest News Updates