రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు తెలిపారు. బెంగాల్ మంత్రి అఖిల్ గిరి రాష్ట్రపతి ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను తాను రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతున్నట్లు సీఎం మమత ప్రకటించారు. తమ పార్టీ తరపున కూడా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతిపై తమకెంతో గౌరవం వుందన్నారు. వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం తమ పార్టీ కల్చర్ కాదని మమత అన్నారు. రాష్ట్రపతిపై మంత్రి అఖిల్ గిరి అలాంటి వ్యాఖ్యలు చేసి చాలా తప్పు చేశారని పేర్కొన్నారు. ”రాష్ట్రపతిని మేం ఎంగానో గౌరవిస్తాం. ఆమె మంచి మహిళ. అఖిల్ గిరి తప్పుడు వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నా. మా ఎమ్మెల్యే తరపున నేను క్షమాపణలు కోరుతున్నా. ఐయామ్ సారీ.” అంటూ మమత పేర్కొన్నారు.












