ఏపీకి గుడ్ న్యూస్.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటనకు అనుగుణంగా కేంద్రం ఈ కీలక ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన నిధులను కూడా కేంద్రం విడుదల చేసింది. ప్రస్తుతం డీఆర్ఎం కార్యాలయానికి, రైల్వే స్టేషన్ మధ్యలో వున్న వైర్ లెస్ కాలనీలో 106 కోట్ల వ్యయంతో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. 100 ఏళ్ల పాటు పటిష్ఠంగా వుండేలా కార్యాలయాన్ని రూపొందించనున్నారు. పనులు ప్రారంభించిన సమయం నుంచి 36 నెలల్లో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్రం భావించింది.

 

 

ఈలోగా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని బోర్డు నిర్ణయిస్తే… డీఆర్ఎం కార్యాలయం నుంచి తాత్కాలికంగా జోనల్ మేనేజర్ బాధ్యతలు నిర్వర్తించేలా కూడా సన్నాహాలు చేస్తున్నారు. తాజా ప్రకటనలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ రోడ్డులో 106 కోట్ల నిధుతో కొత్త రైల్వే జోన్ కు సంబంధించిన భవనాలు నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన టెండర్లను కూడా పిలవనున్నారు. మొత్తం 7 ఫ్లోర్లలో ప్రధాన కార్యాలయం భవంతి వుండనుంది. ప్రతి భవనానికి కూడా 2 యాక్సెస్ పాయింట్లు, రెండు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను ఏర్పాటు చేస్తున్నారు. బీటీ రోడ్ల కోసం 2.64 కోట్లు, సీసీ రోడ్లకు 1.66 కోట్లు, పుత్ పాత్ ఏరియాకు 32 లక్షలు, పార్కింగ్ ఏరియా కోసం 1.08 కోట్లు, ప్లాంటేషన్ కు 2.16 కోట్లు, బిల్డ్ అప్ ఏరియాకు 71.64 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రారంభమైన నాటి నుంచి 36 నెలల్లో భవనాన్ని పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు.

Related Posts

Latest News Updates