బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత అఖిల్ గిరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రపతి ఎలా వుంటారు? అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమ్ము దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి. తాము ఎవరినీ వారి రూపాన్ని బట్టి అంచనా వేయమని, తాము రాష్ట్రపతి పదవిని గౌరవిస్తామని, కానీ మన రాష్ట్రపతి ఎలా కనిపిస్తున్నారు? అంటూ ర్యాలీ వేదికగా ప్రశ్నించారు. అయితే… ఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని టీఎంసీ మండిపడింది. ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, పూర్తిగా వ్యక్తిగతమని పార్టీ అధికార ప్రతినిధి సాకెత్ గోఖలే ట్వీట్ చేశారు. తాము రాష్ట్రపతి పట్ల ఎంతో గర్వపడుతున్నామని, ఆమె పదవిని అత్యున్నతంగా చూస్తామని స్పష్టం చేశారు.
అయితే… తన వ్యాఖ్యలపై మంత్రి గిరి క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతిని తాను చాలా గౌరవిస్తానని, సువేందుకు సమాధానం చెప్పేందుకు పదవిని చూపిస్తూ వ్యాఖ్యానించానని అన్నారు. తాను రాష్ట్రపతి అని సంబోధించాను కానీ… ఎవ్వరి పేరూ చెప్పలేదన్నారు. దీనిని భారత రాష్ట్రపతి అవమానకరంగా భావిస్తే… క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.












