టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. 2023 జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ లోకేశ్ పాదయాత్ర చేయనున్నారు. ఏడాది పాటూ లోకేశ్ ప్రజల్లోనే వుండే విధంగా పార్టీ ఈ పాదయాత్రను రూపకల్పన చేసింది. అయితే… దీనికి సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు. సీనియర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రజల సమస్యలను తెలుసుకోవడం, సభల్లో ప్రసంగించడం… ఇలా కార్యక్రమాల రూపకల్పన జరగనుంది.












