ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా నేడు విశాఖకు రానున్నారు. 7,614 కోట్లతో చేపట్టనున్న డెవలప్ మెంట్ కార్యక్రమాలకు సీఎం జగన్ తో కలిసి ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా 7,169 కోట్లతో పనులు పూర్తైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు సీఎం జగన్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రధాని మోదీ విశాఖలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకుంటారు. అక్కడి నుంచి నౌకాదళ గెస్ట్ హౌజ్ కి వెళ్లి, రాత్రి బస చేస్తారు. 12 వ తేదీ ఉదయం 10 గంటలకు చోళ గెస్ట్ హౌజ్ నుంచి బయల్దేరి.. ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం సీఎం జగన్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి రామంగుండానికి చేరుకుంటారు.












