చెన్నై- మైసూరు మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ లో మోదీ ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు చెన్నై, బెంగళూరులోని టెక్ స్టార్టప్ హబ్, పర్యాటక కేంద్రం మైసూరు మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో పాటు ప్రధాని మోదీ భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు.భారత్ గౌరవ్ పథకం కింద కర్ణాటక ప్రభుత్వం, రైల్వే కలిసి ర్ణాటక నుండి కాశీకి యాత్రికులను పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని రోజుల క్రిందటే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
https://twitter.com/PIB_India/status/1590929909077413889?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1590929909077413889%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2F












