దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పని ఖతం : ప్రధాని నరేంద్ర మోదీ

దేశంలో రెండు రాష్ట్రాలు మినహా, కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ కనుమరుగైందని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. అభివృద్ధికి కాంగ్రెస్ శత్రువని, అస్థిరతకు, అవినీతికి కేరాఫ్​ అడ్రస్​ అని విమర్శించారు. హిమాచల్​కు స్థిరమైన, బలమైన డబుల్ ఇంజన్ సర్కారు అవసరమని అన్నారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.

 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హిమాచల్​కు ద్రోహం చేసిందని, తాను ప్రధాని అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేద్దామంటే కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లు ఏనాటికీ అభివృద్ధిని కోరుకోరని మండిపడ్డారు. ఆర్మీ చీఫ్‌‌ను అవమానించారని, సైనికులను గూండాలతో పోల్చారని ఆరోపించారు. సర్జికల్ స్ట్రయిక్స్‌‌పైనా సందేహాలు లేవనెత్తారని మండిపడ్డారు. దేవుళ్ల లాంటి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతున్నారని మోదీ అన్నారు.

Related Posts

Latest News Updates