ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ మరో ఇద్దరు తెలుగు వారిని అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పెన్నాక శరత్ చంద్రారెడ్డితో పాటు మద్యం వ్యాపారిగా వున్న వినయ్ బాబును అరెస్ట్ చేసింది. వీరిద్దరూ కోట్లలో మద్యం వ్యాపారం చేస్తున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు శరత్ పై అభియోగాలున్నాయి.
వినయ్ బాబు పెర్నాడ్ రికార్డ్ అనే లిక్కర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన అధికారులు.. రెండు రోజుల నుంచి శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును విచారిస్తున్నారు. తెలంగాణకు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్, ముంబైకి చెందిన విజయ్ నాయర్, ఢిల్లీకి చెందిన సమీర్ మహేంద్రును ఇది వరకే ఈడీ అధికారులు అరెస్టు చేశారు.