పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ చిత్రం నుండి బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ అవుట్

పవర్ స్టార్.. జన సేనాని పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’ . పీరియాడిక్ డ్రామా. మొఘల్ కాలానికి చెందిన బ్యాక్ డ్రాప్‌తో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ తప్పుకున్నారని సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు..పవర్ స్టార్.. జన సేనాని పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తోన్న తాజా చిత్రం ‘హరి హర వీర మల్లు’ . పీరియాడిక్ డ్రామా. మొఘల్ కాలానికి చెందిన బ్యాక్ డ్రాప్‌తో డైరెక్టర్ క్రిష్) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ తప్పుకున్నారని సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు.. అర్జున్ రాంపాల్ . నిజానికి ఈ బాలీవుడ్ స్టార్ ముందుగా హరి హర వీర మల్లు చిత్రంలో ఔరంగబేజు పాత్రలో నటించటానికి ఒప్పుకున్నారు. కానీ పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. దీంతో అర్జున్ రాంపాల్ డేట్స్ ప్రాబ్లమ్ రావటంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారట. దీంతో దర్శక నిర్మాతలు మరో బాలీవుడ్ సీనియర్ స్టార్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంతకీ హరి హర వీర మల్లులో అర్జున్ రాంపాల్ ప్లేస్‌లో నటించబోతున్న మరో స్టార్ ఎవరో తెలుసా..బాబీ డియోల్ . సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నటుడిగా తనదైన ముద్ర వేసిన బాబీ డియోల్ అన్నీ చక్కగా కుదిరితే టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తారు. హరి హర వీర మల్లు చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రానుంది. ఈ సినిమా ఫైనల్ స్టేజ్ షూటింగ్‌లో పవన్ బిజీగా ఉన్నారు. ఖుషి నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పండగ సాయన్న పాత్రను ఆధారంగా చేసుకునే క్రిష్ … ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related Posts

Latest News Updates