రాజమండ్రి దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్లు రద్దు

రాజమండ్రి స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారు 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. దీంతో రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని, ట్రాక్ మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. గూడ్స్ పట్టాలు తప్పిన కారణంగా ఇతర రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో మొత్తం 9 రైళ్లను రైల్వే రద్దు చేసేసింది. మరో 2 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రద్దైన వాటిలో విజయవాడ నుంచి విశాఖ, గుంటూరు- విశాఖ, విజయవాడ- కాకినాడ మధ్య నడిచే రైళ్లు వున్నాయి. అయితే.. విజయవాడ -లింగంపల్లి మధ్య నడిచే రైలు 2 గంటలు ఆలస్యంగా నడుస్తుంది.

Related Posts

Latest News Updates