ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఇప్పటం గ్రామ బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో బాధితుడికి లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ప్రభుత్వ దాష్టీకానికి ఇళ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు ఆవాసాలు కోల్పోయారన్నారు. వారందరికీ అండగా వుండాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని ప్రకటించారు. ఈ ఘటన ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైందన్నారు. ఇళ్లు దెబ్బతిన్నా… ఇప్పటం గ్రామస్థులు ధైర్యం కోల్పోలేదన్నారు. వారి గుండె నిబ్బరాన్ని చూసి పవన్ చలించిపోయారని, వారికి అండగా వుండాలని నిర్ణయించుకున్నారని మనోహర్ ప్రకటించారు.

Related Posts

Latest News Updates