పంజాబ్ లోని లుథియానాలో వుంటున్న ఐదుగురు హిందూ నేతలకు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందజేసింది. ఎక్కడికి వెళ్లినా… వాటిని ధరించాలని ప్రభుత్వం వారికి సూచించింది. కొన్ని రోజుల క్రితం శివసేన నేత సుధీర్ సూరీపై కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కొందరు హిందూ నేతలకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. దీంతో స్థానిక పోలీసులు వారికి రక్షణ కూడా కల్పించి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందజేశారు. రాజీవ్ టాండన్, అమిత్ అరోడా, యోగేష్ బక్షీ, నీరజ్ భరద్వాజ్, హర్ కిరత్ ఖురానతో పాటు గురుసిమ్రాన్ సింగ్ కు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందజేసింది.












