తమకు కూడా హాస్టల్ సౌకర్యం కలిపించాలంటూ నిజాం కాలేజీకి చెందిన అండర్ గ్రాడ్యూయేట్ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుంటూ ట్వీట్ చేశారు. నిజాం కాలేజీల విద్యార్థినుల సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. నిజాం కాలేజీ ఫంక్షన్ సందర్భంగా హాస్టల్ కట్టిస్తానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ కట్టిన తర్వాత కూడా వివాద అనవసరమని కేటీఆర్ అన్నారు. వెంటనే విద్యార్థులతో, నిజాం కాలేజీ యాజమాన్యంతో మాట్లాడాలని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. మరోవైపు ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

నిజాం కాలేజీ ఫస్ట్ గ్రాడ్యూయేషన్ డేకు అటెండైన కళాశాల పూర్వ విద్యార్థి, మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తరఫున కాలేజ్ అభివృద్ధికి రూ.5 కోట్ల ఫండ్ కేటాయించారు. ఈ నిధులతో పాటు ఓయూ వీసీ మరో కోటి రూపాయిల ఫండ్ కాలేజీకి అలాట్ చేశారు. ఈ నిధులతో అధికారులు కాలేజీ హాస్టల్ భవనం నిర్మించారు. అయితే ఈ హాస్టల్ ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో యూజీ విద్యార్థుల గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు.
Request Minister @SabithaindraTRS Garu to kindly intervene and address the issue
As per the request of the students, girls hostel was built and handed over to the college. This situation seems unwarranted https://t.co/HddjVl8KG0
— KTR (@KTRTRS) November 8, 2022







