రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ ధన్కర్ చోటు కల్పించారు. మొత్తం 9 కమిటీల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటు దక్కింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఎథిక్స్ కమిటీల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి, టీఆర్ఎస్ ఎంపీ కేకే కి చోటు కల్పించారు. ఇక… కమిటీ ఆన్ రూల్స్ లో బీజేపీ ఎంపీ డా. కె. లక్ష్మణ్ కు, కమిటీ ఆన్ ప్రివిలైజెస్ లో జీవీఎల్ నర్సింహారావుకు, కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ లో కేఆర్ సురేష్ రెడ్డి (టీఆర్ఎస్) కి చోటు దక్కింది. మరోవైు హౌజ్ కమిటీకి చైర్మన్ గా సీఎం రమేశ్ (బీజేపీ), సభ్యుడిగా టీఆర్ఎస్ కి చెందిన బడుగుల లింగయ్యకు చోటు దక్కింది.







