మునుగోడు బై పోల్ లో కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో శ్రేణులు ఢీలా పడిపోయాయి. పైగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నడుస్తున్న సమయంలో బైపోల్ జరిగింది. దాని ప్రభావం పార్టీపై ఏమాత్రం లేదని తేలిపోయింది. అయితే… మునుగోడు ఫలితంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మునుగోడులో వచ్చిన ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నదే ముఖ్యమని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని అన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నిఖార్సుగా, నిబద్ధతతో పనిచేసిన ప్రతీ కార్యకర్తకు, నాయకుడికి రేవంత్ ధన్యవాదాలు ప్రకటించారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నది ముఖ్యం.
మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతగా పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
— Revanth Reddy (@revanth_anumula) November 6, 2022