మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ విజ‌య దుందుభి మోగించింది. ప్ర‌తి రౌండ్‌లోనూ అధికార పార్టీ ఆధిక్యం ప్ర‌ద‌ర్శించి, విజ‌యాన్ని ముద్దాడింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి 11,666  ఓట్ల‌ మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రెండో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది.  పాల్వాయి స్ర‌వంతికి కనీసం డిపాజిట్ రాలేదు.  మొత్తం 15 రౌండ్ల లెక్కింపు పూర్తయింది.   రెండు, మూడవ రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలో తెరాస తన సత్తా చాటుకుంది.  చివరి 15వ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌కు 101853, బిజెపికి 90187, కాంగ్రెస్‌కు 23243 ఓట్లు వచ్చాయి. తెరాస 11666 మెజారిటీతో గెలిచింది.